
అక్కినేని అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు అక్కినేని అఖిల్. ఏజెంట్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు మేకర్స్.. అయితే ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న ఈ చిత్ర బృందానికి కరోనా అడ్డుకట్ట వేసింది..

సురేందర్ రెడ్డి అఖిల్ సినిమాకి డైరెక్టర్ అనగానే అందరు ఆశ్చర్యపోయారు. యాక్షన్ ఎంటెర్టైనర్. తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని చెబుతూ సినిమా గురించి, అందులో అఖిల్ పాత్ర గురించి సురేందర్ రెడ్డి భారీ హైప్ ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి కథను పక్కాగా రెడీ చేస్తున్నారు. కథ పూర్తయినా కూడ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి కొందరు రచయితలతో ఒక బందాన్ని ఏర్పాటు చేసి స్టోరీకి మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను భారీ విజయంగా మలచాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది.