చెర్రీ, శంకర్ ల సినిమా పాన్ ఇండియా రేంజ్ కాదా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలో రామ్ చరణ్ RRR అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు..  అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా సెట్ చేశాడు..

అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందట. దాదాపు 150 కోట్ల నుంచి 200కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గరినుంచి మెగా అభిమానుల్లో ఒకటే సంబరం నెలకొంది. వరుస ఫ్లాప్ లతో ఉన్న శంకర్ కి రామ్ చరణ్ ఛాన్స్ ఇవ్వడం కూడా రిస్క్ అనే అభిమానులు ఉన్నారు..అయితే శంకర్ అనుభవం దృష్ట్యా ఈ సినిమా కి ఆయనకి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్, శంకర్ లాసినిమా పాన్ ఇండియా సినిమా కాదని అంటున్నారు. ఈమేరకు ఓ రూమర్ షికార్లు కొడుతుంది. RRR సినిమా తో రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ సంపాదిస్తాడు..నెక్స్ట్ సినిమా ఎందుకు పాన్ ఇండియా కాదని అంటున్నారు ఫాన్స్ మరోవైపు. బెంచ్ మార్క్ చిత్రాల్లో ఒకటైన “అపరిచితుడు” హిందీ రీమేక్ కూడా అనౌన్స్ అయ్యింది. అక్కడి స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపైనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే తెరకెక్కుతుందా లేక శంకర్ మార్క్ కి తగ్గట్టుగా పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతుందా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. దీనితో ఈ చిత్రం కేవలం హిందీలోనే తెరకెక్కి అక్కడ రిలీజ్ అయ్యే చాన్సులు ఉన్నాయని కూడా మరో టాక్..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.