
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ
సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ
చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో
సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు
సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు.
సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను
తెలియజేశారు.
సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ
చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు
వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా,
హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ ఓరియెంటెడ్
మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడంతో
ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సకుటుంబంగా థియేటర్ కు
వెళ్లి ఎంజాయ్ చేసే మూవీ అనే అభిప్రాయం వారిలో ఏర్పడుతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ - సత్య జి,
సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం - కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ -
యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరసింహ రాజు, ప్రొడక్షన్
డిజైనర్ - రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ - శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత -
అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాణం - యూవీ
కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం - అనిల్ కుమార్ ఆళ్ల.