
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్
సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను
నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ,
శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ సఱ్మ, రాజ్ చెంబోలు,
రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా
శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో
సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ
సందర్భంగా
దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ..నా ఫేవరేట్ మూవీస్ లో ద హాలీడే ఒకటి.
ఈ సినిమాలో మీట్ క్యూట్ అనే పదాన్ని విన్నాను. పరిచయం లేని ఇద్దరు
ఊహించని ఒక అందమైన ప్రదేశంలో కలుస్తారు. వీరి మధ్య సాగిన అందమైన సంభాషణ
జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది. మన లైఫ్ లో ఎదురయ్యే అందమైన సందర్భాలను ఈ
అంథాలజీ చూపిస్తుంది. వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు
అందిస్తున్న సోని లివ్ ద్వారా మీట్ క్యూట్ ప్రదర్శితం కాబోతుండటం
సంతోషంగా ఉంది. అని చెప్పింది.