
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం కర్ణన్. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించింది. పరిశ్రమలోని ప్రముఖులు ఈ చిత్రాన్ని స్పెషల్ షోస్ వేసుకొని మరీ చూశారంటే ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అసురన్ సినిమాతో నేషనల్ అవార్డ్ కొట్టిన ధనుష్ ఈ చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ వద్ద చెలరేగిపోయాడు. ప్రస్తుతం ధనుష్ సినిమాలు వరసగా తెలుగులో డబ్ అవుతున్నాయి.


వెట్రిమారన్ తెరకెక్కించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ నారప్పగా రిమేక్ చేస్తుండగా శ్రీకాంత్ అడ్డలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన కర్ణన్ సినిమాని కూడా తెలుగులో రిమేక్ చేస్తునట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత కర్ణన్ రిమేక్ మొదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.


అయితే ఇప్పుడు ఈ రీమేక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధనుష్ పెర్ఫార్మెన్స్ ను బెల్లంకొండ శ్రీనివాస్ మ్యాచ్ చేయగలడా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ధనుష్ ఎలాంటి నటుడో మనందరికీ తెలిసిందే. అసురన్ రీమేక్ కి రాని డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వెంకటేష్ గారిది అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. శ్రీనివాస్ ఇప్పటి వరకూ అలాంటి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయలేదు. ఆయన కెరీర్ లో రాక్షసుడు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఆయనకు కూడా తెలుసు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.