
అన్ లాక్ 5.0 లో దాదాపు అన్ని వ్యాపారాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కాగా జిమ్ లు ఇది వరకే రీఓపెన్ అయ్యాయి. ఇక సెలబ్రిటీలంతా తమ తమ ఫిట్నెస్ ని కాపాడుకునేందుకు జిమ్ లలోకి ఎంటరైపోతున్నారు. ఇప్పుడు రాశిఖన్నా, రష్మిక మండన్న కూడా బిజీ బిజీ గా వర్కౌట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మలిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుల్దీప్ సేథీ అనే ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఒకే జిమ్ లో ఇద్దరూ వర్కవుట్లు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాశిఖన్నా ఫోటోని షేర్ చేసి ఒక క్రేజీ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.
మేము యాష్ కలర్ డ్రెస్ లో ఉన్న ట్విన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక నుంచి హీరో, హీరోయిన్లు అందరూ జిమ్ ల బాట పట్టేలా ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత అందరూ ఇలా ఫిట్ నెస్ పై దృష్టి సారించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కొంతమంది కరోనాని లైట్ గా తీసుకోవద్దంటూ జాగ్రత్తలు సూచిస్తూ హెచ్చరిస్తున్నారు.