
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తాను కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే బన్నీ తనకి బాగానే ఉందని హోమ్ క్వారంటైన్ లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ గా ఉన్నానని తెలిపి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరి మొత్తం పదిహేను రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్న బన్నీ అభిమానులు హమ్మయ్య అనుకునే వార్తను అందించాడు. ఇన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న బన్నీ ఎట్టకేలకు కరోనా నెగిటివ్ అయ్యినట్టుగా తెలిపాడు. దీనితో తన ఆరోగ్యం కోసం బాగుండాలని కోరుకున్న అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసాడు.

అలాగే లాక్ డౌన్ కూడా కేసులు తగ్గిస్తుందని భావిస్తున్నానని బన్నీ తెలిపాడు. ప్రస్తుతం బన్నీ దర్శకుడు సుకుమార్ తో పుష్ప అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.