
తెలుగులో ఇంకా హీరోగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ మొదలుపెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ సినిమాకి దర్శకత్వం చేయమని బెల్లంకొండ మొదట్లో పలువురి దర్శకులను రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలకు వినాయక్ ఈ ఈ సినిమా ని ఒప్పుకున్నాడు.. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తాడని ముందు వార్తలొచ్చాయి.

ఐతే అది నిజం కాదని సుజీతే స్వయంగా వెల్లడించాడు. మరి అతడి స్థానంలోకి వినాయక్ వచ్చాడని తెలుస్తుంది. ‘అల్లుడు శీను’తో తెలుగులో మొదటి సినిమా చేయగా ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి హిట్ కొట్టాడు.. నిజానికి టాలీవుడ్ లో శ్రీనివాస్ ని లాంచ్ చేసిన వినాయక్ బాలీవుడ్ లో లాంచ్ చేయడం విశేషం..ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో రెగ్యులర్ ప్రారంభించాల్సి ఉంది కానీ ఇప్పుడు అది కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.

ఛత్రపతి
స్క్రిప్ట్‌ని బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వినాయక్ హిందీ రచయితల సహాయంతో పూర్తిగా మార్చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నిలిపివేయలేదనిఅనేక ఇతర సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టారని తెలిసింది.