లోకనాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

‘కమల్ హాసన్’ భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ రోజు పద్మభూషన్ కమల్ హాసన్ పుట్టిన రోజు.  భారత దేశపు ప్రముఖ నటుడు, లోకనాయకుడు, బహుముఖ ప్రజ్ఘాశాలి,  యునివర్సల్ స్టార్ పద్మభూషన్ కమల్ హాసన్ నవంబర్ 7  వ తేదీ  1954  లో జన్మించారు. తమిళనాడులో  రామానాథపురం జిల్లాలోని పరమకుడి ఊరు కమల్ హాసన్ స్వగ్రామం. రాజ్యలక్ష్మీ, శ్రీనివాసన్ కు నాల్గవ సంతానం కమల్ హసన్.

ప్రయోగాత్మక సినిమాలకు,  విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్ హాసన్. తన నటన తో, డాన్స్ తో,  దర్శకత్వంతో దక్షిణాది ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కళాకారుడు కమల్ హాసన్.  కేవలం నటనతోనే కాదు  ప్రొడ్యూసర్ గా, రచయితగా, స్ర్కీన్ ప్లే రైటర్ గా  సినిమా రంగం లో తనదంటూ ముద్ర వేశాడు. ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా రాణీస్తున్నారు. పరిపూర్ణ నటుడికి కావల్సిన అభినయం కమల్ హాసన్ సొంతం. 65 ఏళ్ళున్న కమల్ హాసన్ 58  ఏళ్ళు సినిమా కే అంకింతం. 1960 లో వచ్చిన కలత్తుర్ కన్నమ్మ చిత్రంతో బాలానటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.  తన నటనతో జాతీయ స్థాయి ఉత్తమ బాల నటుడి అవార్డు పొందాడు. అక్కడి నుండి ఇప్పటి వరకూ  కమల్ హసన్ తిరిగి చూసుకోలేదు. ఏన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, ప్రసంశలు. జీవితంలో ఇన్ని  సాధించాలంటే ఒక్క కమల్ హాసన్ కే సొంతం. అందుకే అతను విశ్వనటుడు, దక్షిణాది ప్రేక్షకుల లోకనాయకుడు అయ్యాడు. సింగితం శ్రీనివాస్, కె.విశ్వనాథ్, కె.బాలాచందర్ దర్శకులతో చేసిన సినిమాలు కమల్ కేరీర్ టాప్ సినిమాలు గా చెప్పుకోవచ్చు. కమల్ కె.విశ్వనాథ్, కె.బాలాచందర్ తన గురువులుగా భావిస్తాడు. ప్రస్తుతం కమల్ సినిమాలతో పాటు టి.వి రంగం, రాజకీయ రంగంలో  కూడా కొనసాగుతున్నారు. ఈ విశ్వ నటుడుకి  పుట్టిన రోజు శుభాకాంక్షలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.