85 వ పడిని చేరుకున్న గంధర్వ గాయకి పి. సుశీల

పి. సుశీల గారి గురించి  మాట్లాడాతున్నమంటే ఒక వినసొంపైన కమ్మని పాట గురించి మాట్లడినట్టే. సుశీల గారి గురించి వింటున్నామంటే ఆహ్లదమైన చల్లటి పాట వింటున్నట్టే. మనసుకు నచ్చిన  సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా సంగీతం గురించి చెప్తున్నామంటే ఖచ్చితంగా అందులో  సుశీల గానం ఉన్నట్టే. ఒక పాట విని ఆస్వదించే వాళ్ళకి ఆమె గాన సరస్వతి, విన్న పాట గొంతు గురించి మాట్లాడేవాళ్ళకి గంధర్వ గాయకి, మొత్తానికి గానం వినే ప్రేక్షకులకు, గానం స్వర పరిచే సంగీత దర్శకులకు సుశీల అంటే గాన కోకిల. పి సుశీల గారు 1935 నవంబర్ 13 న జన్మించారు. బ్రిటిష్  పాలన సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ, విజయనగరం లో  జన్మించారు. పి.సుశీల గారు పులపాక ముకుందరావు, శేషావతారం  గారి కుమార్తె . పులపాక ముకుందరావు గారు విజయనగరంలో అడ్వకేట్ గా పని చేస్తుండెవారు. సుశీల గారిది సంగీత నేపథ్యం వున్న కుటుంబం. సుశీల నాన్న గారు సుశీల గారిని ఎమ్. ఎస్ సుబ్బలక్ష్మీ అంతటి గాయనిగా చూడలన్నది అతని కోరిక. అందుకే సుశీల గారిని మహరాజ సంగీత కళాశాలలో జాయిన్ చేయించి సుశీల గారికి క్లాసిక్ సంగీతం నేర్పించారు.

మొదటి పాట

సుశీల గారు  1952  లో  ‘పెట్రా తాయ్’ అనే తమిళ సినిమా లో మొదటి పాట ఎ.ఎమ్ రాజా తో కలిసి ‘ఎదుకూ అజతాయ్’ అనే పాట పాడారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు పెండ్యాలా నాగేశ్వరరావు సంగీతం సమకూరుస్తూ కొత్త గొంతు ఉంటే బావుంటుందని కొత్త గాయని కోసం వెతికారు. అలా కొత్త సింగర్స్ కోసం పెండ్యాల నాగేశ్వర రావు ఎయిర్ ఇండియా రెడియోని అప్రోచ్ అయ్యారు. ఎయిర్ ఇండియా రెడియో పోటిలో గెలిచిన ఐదు మంది సింగర్స్ ని పెండ్యాల నాగేశ్వర రావు ఆడిషన్ చేశారు. ఆ అడిషన్ లో సుశీల గారు సెలెక్ట్ అయ్యారు. అలా వెంటనే ‘పెట్రా తాయ్’ అనే తమిళ సినిమాకి సింగర్ గా సంతకం చేశారు. తర్వాత అదే సినిమా తెలుగులో ‘కన్న తల్లి’ పేరుతో రీమేక్ చేశారు. సుశీల గారు అదే  పాటని తెలుగులో ఘంటసాలతో కలిసి పాడింది. మొదటి సినిమాలో ఆవిడ గొంతు వినపడ్డాక సుశీల  గారి పేరు మారుమోగింది. సుశీల గారికి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఎ.వి.యం స్టూడియో వాళ్ళు   ఆ ప్రొడక్షన్ నుండి వచ్చె ప్రతి సినిమా లో సుశీల గారు సింగర్ గా కాంట్రక్ట్ చేసుకున్నారు.

సుశీల పాట  ప్రతి నోట

చలన చిత్ర సంగీత రంగంలో లీల, వసంత కుమారి ,జిక్కి వంటి గొప్ప సింగర్స్ గా  కొనసాగుతున్నారు.  ఆ సమయంలో సుశీల గారు సినిమా ఎంట్రీ ఇచ్చి వాళ్ళ తో సమానంగా పాటలు పాడుతూ ప్రశంసలు అందుకున్నారు. హేమా హేమీలుగా ఉన్న సింగర్స్ ని దాటుకుని కంపిటేటివ్ గా నిలబడి పాటలు పాడటం అంటే మాములు విషయం కాదు. ఆ స్థాయిలో రాణించాలంటే ఎంతో కృషి తో పాటు మధురమైన గొంతు, పదాలు పలికే మంచి స్పష్టత ఉండాలి. అందుకే అవన్నీ మెండుగా ఉన్న సుశీల  గారిని గంధర్వ గాయని అంటారు. తియ్యని తేనె లొలికే  పాట వినిపిస్తుందటే ఆ పాట పాడిన గాయకి సుశీల గారే.  అలా తియ్యని పాట పాడుకునే ప్రతి నోట సుశీల గారి పాట ఉంది. 1955 సవంత్సరంలో సుశీల గారి పాటలకి విపరీతమైన పాపులారిటీ వచ్చెసింది. తెలుగులో విడుదలైన సుపర్ హిట్ చిత్రం మిస్సమ్మ సినిమాలో సుశీల గారు పాడిన పాటలు అందరి నోట మారు మోగాయి. క్లాసికల్ హిట్స్ అయ్యాయి. కర్ణటక సంగీతంలో కూడా సుశీల గారు పేరు ప్రఖ్యాతలు పొందారు. కన్నడ సంగీతంలో కూడా సుశీల పాట హిట్ అయ్యింది. సుశీల గారు తెలుగు, తమిళం, కన్నడం తో పాటు మళయాళం లో కూడా  పాటలు పాడారు అలా  తియ్యని పాట పాడుకునే ప్రతి నోట సుశీల గారి పాట ఉంటుంది.

ఎన్నేన్నో  ఎవర్ గ్రీన్స్

ఎక్కువగా సుశీల గారు తెలుగులో ఘంటసాల గారితో, తమిళ్ లో టి.ఎమ్ సౌందర్ రాజన్ గారితో, కన్నడంలో పి.బి శ్రీనివాస్ గారితో అలాగే జె.ఏసుదాస్ తో కలిసి పాడిన డ్యూయెట్ పాటలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాయి. సంగీత ప్రియులను సుశీల గారి పాటలు మంత్రముగ్దుల్ని చేశాయి. అనగనగా ఒక రాజు, ఊహలు గుస గుస, తెలిసిందిలే తెలిసిందిలే, నిన్ను నేను చూస్తున్న, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, చేతిలో చెయ్యోసి, వినర అలనాటి, ప్రేమ యాత్రలకు బృందావనము, నన్ను దోచుకుందువటే,  ఎల్లువొచ్చి, నన్ను వదిలి, అదే అదే, నెలవంక తొంగి, అరేసుకోపోయి, మబ్బుల్లో ఏముంది, హిమగిరి సొగసుల్లో, నాగ మల్లివో తేగ మల్లివో, పచ్చ గడ్డి కోసేటి, సరిగమలు, చిత్రం భలారే, ఓ బంగరు రంగుల చిలక. ఇలా వినుకుంటూ పోతే సుశీల గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఒక మహ సముద్రం.

అవార్డులు

సుశీల గొంతుకు ఎన్నో అవార్డులు లభించాయి.  1969 సంవత్సరంలో ఉయర్ నాదా మణిధన్ అనే తమిళ సినిమాలో సుశీల గారు పాడిన ‘నాలై ఇంత వేలై పార్థు’ అనే పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. ఇలా  ఐదు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.  అలాగే ఫిల్మ్ ఫేయిర్ అవార్డ్స్ సౌత్ కూడా పొందింది. తమిళ ప్రభుత్వం కలైమామిని అవార్డు తో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు తో, కర్ణాటకలో గాన సరస్వతి అవార్డుతో సుశీల గారిని సత్కరించారు. భారదేశపు గౌరవప్రదమైన పద్మ భూషణ్ అవార్డును సుశీల గారు పొందారు. దాదాపు పదికి పైగా నంది అవార్డులు పొందారు  మూడు  సౌత్ స్టేట్ అవార్డులు కూడా పొందారు. భారతదేశంలోనే కాదు విదేశాల నుండి కూడా సుశీల గారు అవార్డు పొందారు. భారత దేశపు ఎక్కువ భాషల్లో పాటలు పాడిన ప్లే బ్యాక్ సింగర్ గా సుశీల గారిని గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ వారు గుర్తించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు  సుశీల గారి పాటలకు సొంతం. గాన కోకిల, గంధర్వ గాయని గా సుశీల గారు  బిరుదులు పొందారు. సుశీల గారికి మొహన్ రావు తో వివాహం జరిగింది. సుశీల గారికి  కొడుకు జయకృష్ణ, ఇద్దరు మనవరాళ్ళు  సుభాశ్రీ, జయ శ్రీ  ఉన్నారు. సౌత్ ఇండియా సినిమాలో ఆరు దశాబ్దాలుగా సుశీల  గారి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగులో పన్నెడు వేల పాటలు, ఆరు వేల పాటలు తమిళంలో, ఐదువేల పాటలకు పైగా కన్నడంలో, పన్నెండు వందల పాటలు మళాయంలో ఇంకా ఇతర భాషల్లో కలుపుకుని మొత్తం 30 వేల పై చిలుకు పాటలను ఆవిడ పాడారు.

తెలుగు సంగీతం గర్వించదగ్గ గాన సర్వసతి ,గాన కోకిల, గంధర్వ గాయకి పి. సుశీల గారికి మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.