క్రియేటివ్ డైరెక్టర్ ‘క్రిష్’కి జన్మదిన శుభాకాంక్షలు

‘గమ్యం’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు రాధా క్రిష్ణ జాగర్లమూడి (క్రిష్). సమాజం పట్ల, జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేని హీరో తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే జర్నీలో తనకు పరిచయమైన వ్యక్తి కారణంగా, తన జీవితానికి అర్థం తెలుసుకుంటాడు.  మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు క్రిష్. ఆ తర్వాత అల్లు అర్జున్, హిందీ నటుడు మనోజ్ బాజ్ పాయ్, మంచు మనోజ్ అనుష్క ముఖ్య పాత్రలలో ‘వేదం’ అనే సినిమా తీశారు. అందులో సమాజంలోని హెచ్చు తగ్గులను, స్వార్థ పూరిత సంధర్భాలలో మనిషి యొక్క నిజ స్వరూపాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఎటువంటి ఫిల్టర్ లేకుండా తీసి ప్రేక్షకులు, విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నారు. కేబుల్ రాజుగా అల్లు అర్జున్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సమాజం పై ఎంతో లోతైన అవగాహన లేకపోతే ఇటువంటి సినిమాలు తీయడం చాలా కష్టం. గమ్యం సినిమాకు గాను నంది అవార్డు, వేదం సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. వేదం సినిమానే తమిళంలో ‘వానమ్’ అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత 2012 లో రానాతో ‘కృష్ణం వందే జగద్గురుం’ తీశారు. ఆ  సినిమాలో అప్పుటికి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రానా నుండి అత్యుత్తమ నటనను చూడచ్చు. తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాను 2015 లో హిందిలో అక్షయ్ కుమార్, శృతి హాసన్ ప్రధాన పాత్రలతో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ అనే పేరుతో  రీమేక్ చేశారు. ఆ విధంగా ఈ సినిమాతో  బాలీవుడ్ లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత వరుణ్ తేజ్, ప్రగ్నా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా 2015 లో ‘కంచె’ అనే సినిమాను తీశారు. ఇందులో కులాంతర ప్రేమ వివహాల గురించి చర్చించారు. 2017 లో తెలుగు వీరుడు. తెలుగు గడ్డ మీద నుండి తన అజేయ సామ్రాజ్యాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తి అయిన శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమాను తీశారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి భారీ సినిమాను తీయడం కేవలం క్రిష్ కే సాద్యమైంది. బాలకృష్ణ

చాలా ప్రెస్టేజియస్ గా తీసిన ఎన్టీఆర్ రెండు భాగాల బయోపిక్ ను అత్యంత సమర్థవంతంగా చాలా తక్కువ రోజుల్లో తీసి ఇండస్ట్రీని మళ్ళీ ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నారు. తర్వాత హిందీలో కంగనా రౌనత్ తో ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితం ఆధారంగా ‘మణికర్ణిక’ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ చివర్లో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తీస్తున్నారు. తెలుగు సాహిత్యానికి సినిమాకు 80 ల తర్వాత బంధం తెగిపోయింది. ఇప్పుడు క్రిష్ చేస్తున్న ఈ ప్రయత్నంతో మళ్ళీ సాహిత్యానికి సినిమాకు లింక్ కుదిరి అత్యుత్తమ సినిమాలు వస్తాయని అశిద్దాం. వైష్ణవ్ తేజ్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడిక్ సినిమా తీయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమాలో కనిపించడం ఇదే ప్రథమం. ఈ విధంగా మొదట్లో సమాజంలో ఉండే రుగ్మతలతో సినిమాలు తీసి. తర్వాత మన భారతదేశ గొప్పదనాన్ని తెలిపే చారిత్రాత్మక సినిమాలు తీసి మనల్ని మంచి సినిమాలవైపు దృష్టి పెట్టేలా చేస్తున్న టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాధా క్రిష్ణ జాగర్లమూడి (క్రిష్) కి మీడియా 9 తరపున  జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.