లేడీ సూపర్ స్టార్ నయనతారకి జన్మదిన శుభాకాంక్షలు

విజయశాంతి గారి తర్వత లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఆవిడ 1984వ సంవత్సరంలో ఓ మలయాళ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు. ఆ తరువాత హిందూ మతంలోకి మారారు. ఈమె మొదటి పేరు డయానా మరియమ్ కురియన్. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ లలో నయనతార ఒకరు. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకుల ముందుకు నయన్ సినిమా మాత్రం సూపర్ స్టార్ రజని కాంత్ ‘చంద్రముఖి’. ఈ సినిమాతో అటు తమిళ, తెలుగు భాషల్లో ఆమె పూర్తి స్థాయిలో గుర్తింపు పొందారు. తర్వాత వెంకటేష్ సరసన లక్ష్మీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బాపు చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత ఎన్నో సినిమాలకు ప్రత్యేక పురస్కారాలు అందుకుంది నయన్. తర్వాత లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనంతరం ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయారు.నేడు నయనతార పుట్టినరోజు. బిజీబిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఈ రోజు నయనతార తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా నయనతారకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నయనతార నేత్రికన్, పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాల్లో నటిస్తుంది. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.