ఏ భాషలో హిట్ అవ్వని రేంజ్ లో వకీల్ సాబ్ ఉండబోతుంది - బోని..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు ఆరు ప్రచార సభలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయన చేసే సినిమా ల విషయానికొస్తే వకీల్ సాబ్ రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.. ఎ.కె రీమేక్ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఇక క్రిష్ సినిమా ఓ వైపు షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ నాటికీ మ్యాగ్జిమం సినిమాలు చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ మరొకొన్ని సినిమాలను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ..

వీటిలో ముందుగా వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా  శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..

ఇకపోతే  చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' గా తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'లో పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు పెట్టామని అన్నారు. చిత్రంలో ఈ రెండు సీన్స్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌ని రెట్టింపు చేసేలా ఉంటాయని తెలిపారు. ఇది వినగానే పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ అమాంతం పెరిగింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.