షావోమి M.I 10i ఫోన్ ని విడుదల చేసిన బాలివుడ్ నటి మన్నార చోప్రా

షావోమి M.I 10i ఫోన్ ని బాలివుడ్ నటి మన్నార చోప్రా విడుదల చేసారు. గచ్చిబౌలిలోని సెల్ ఫోన్ రంగంలో ప్రముఖ రిటైల్ సంస్థ అయిన సెల్ బే షోరూమ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మన్నార చోప్రా మాట్లాడుతూ M.i 10.i ఫోన్ ని తెలంగాణ మార్కెట్ లోకి తన చేతులు మీదుగా విడుదల చేయడం చాల అనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ వేడుకకి ఆవిడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆవిడతో పాటుగా షావోమి స్టేట్ హెడ్ శివేందర్ సింగ్, సెల్ బే సంస్థ ఏమ్.డి సోమ నాగరాజు, ఆ సంస్థ డైరెక్టర్ సంజన, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, అలాగే ఆ సంస్థ ఉద్యోగులు పాల్గొని ముందుగా బుక్ చేసుకున్న 10 ఫోన్లను వినియోగదారులకు అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. శివేంద్ర సింగ్ మాట్లాడుతూ 108 మెగా పిక్సల్ కెమెరా 5G కి సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడింది, అలాగే 750G SoC స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో, లాంగ్ లాస్టింగ్ బ్యాటరి ఉంది అని ఆయన అన్నారు. కలర్ విషయంలో కాని, స్పీడ్ విషయంలో కాని చాల పెర్ఫెక్ట్ గా ఉంది. బ్రౌజింగ్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడుకునేటప్పుడు అసలు హ్యంగ్ అవ్వకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలతో దీన్ని డిజైన్ చేసారు. ఇన్ని ఫీచర్స్ తో ఉన్న ఈ ఫోన్ ధర 20999/- రూపాయలు. ఇందులో ‘కాల్ అఫ్ డ్యూటి’ లాంటి గేమ్స్ హెవీ గ్రాఫిక్స్ తో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ ఫోన్ ని తెలంగాణలో ఉన్న తమ 58 స్టోర్లలో పొందవచ్చు అని చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.