ప్రతిభకు నిలువెత్తు రూపం ‘తారక్’

ఎన్టీఆర్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. నటుడిగానే కాకుండా గాయకుడిగా, డ్యాన్సర్ గా, వ్యాఖ్యాతగా తన ప్రతిభను చాటుకున్న ప్రతిభావంతుడు. దక్షిణాది హీరోల్లో డ్యాన్స్ మాట వస్తే మొదటగా ఎన్టీఆర్ పేరే గుర్తొస్తుంది. 19 సంవత్సరాల వయసులోనే టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పటికీ అలాగే తన సినిమాలతో మాస్, క్లాస్ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు. ఎన్.టి.రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తన ట్యాలెంట్ తో చిత్ర పరిశ్రమలో అగ్రపథంలో పయనిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కొడుకు ఇంతకన్నా బ్యాగ్రౌండ్ ఏం కావలి ఒక నటుడికి ఇది చాలు ఇండస్ట్రీలో సక్సస్ అవడానికి అన్నారు అందరూ. అవును నిజమే మాజీ ముఖ్యమంత్రి మనవాడి హోదాలో ఇండస్ట్రీని ఎలోచ్చు కాని ఆయన విషయంలో అది జరగలేదు. కెరీర్ తొలినాళ్ళలో వరసగా ఆది, సింహాద్రి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి అమితమైన ప్రతిభ ఉంది కాని ఆ తర్వాత ఒక్క సరైన హిట్ రాలేదు. మధ్యలో కొన్ని హిట్స్ వచ్చినప్పటికీ అవి ఆయన రేంజ్ కి సరిపోయే హిట్స్ అయితే కాదు. దాదాపు అలాంటి హిట్ కోసం ఆయన పుష్కర కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఎన్నో అపజయాలు, ఎన్నో సూటిపోటి మాటలు. కొందరు ఏదో అదృష్టం వల్ల హీరో అయ్యాడని అన్నారు. కొందరు ఆయన బాడి గురించి కామెంట్స్ చేసారు. కొందరు ఆయన డ్యాన్స్ మీద కామెంట్స్ చేసారు. యమదొంగ టైమ్ కి లావుగా ఉండే ఆయన సన్నగా మారాడు. తన నటన గురించి, తన డ్యాన్స్ మీద కామెంట్స్ చేసిన వారికి యమదొంగ సినిమాతో సమాధానం చెప్పాడు. అప్పటి వరకూ ఎన్టీఆర్ ఆ రేంజ్ ఫ్లోర్ మూవ్మెంట్స్ చేయలేదు. డైలాగ్ డెలివరీలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

2009 ఎలక్షన్స్ టైమ్ లో ప్రచారం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. మేజర్ యాక్సిడెంట్. పక్కటెముకలు విరిగిపోయాయి డాక్టర్లు అయితే ఆయన డ్యాన్స్ చేయడం కష్టం అనేసారు. అప్పుడు కూడా ఆయన ఆలోచించింది అభిమానుల కోసమే అభిమానులు ఆయన డ్యాన్స్ అంటే పడి చచ్చిపోతున్నారు. వి.వి వినాయక్ సినిమాలో ఎన్టీఆర్ ఎప్పుడూ చేయని డ్యాన్స్ పెరఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి ఉన్నారు. అదుర్స్ షూటింగ్ టైమ్ లో డ్యాన్స్ చేసేటప్పుడు పక్కటెముకలు విపరీతంగా నొప్పి పుట్టేవి అయిన సరే పట్టు వదలకుండా మూవ్మెంట్స్ లో ఎటువంటి చేంజెస్ లేకుండానే పాటలు పూర్తి చేసాడు. ఈ విషయం గురించి చెపుతూ వి.వి వినాయక్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెబుతూ యాక్సిడెంట్ అయిన క్షణం తన గతం కళ్ళ ముందు కదిలిందని అప్పుడు తాను చేసిన తప్పులన్నీ గుర్తుకువచ్చాయని అయన అన్నారు. చావు దాకా వెళ్ళిన ఆ రోజున తాను చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాసం ఇవ్వమని దేవుడ్ని కోరుకున్నానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎంతోమందికి ఆయన సహాయం చేసారు. తన అభిమానులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే తప్పకుండా సహాయం అందేలా చూస్తున్నారు.

ప్రస్తుతం టి.డి.పి పరిస్థితి ఏం బాలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ పార్టీని, పార్టీ బాధ్యతల్ని స్వీకరించాలని అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందరో రాజకీయ నిపుణులు, విశ్లేషకులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని, ఆయన వస్తేనే తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకడుతుందని తేల్చి చెప్పేశారు. కాని ఆయన మాత్రం వీటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, సినిమాలకి, అభిమానులకే ఈ జీవితం అని ఆయన చెప్పేశారు.

ఆయన వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. మహామహులు సైతం ఆయన స్పీచ్ లకు, ప్రసంగాలకు నిశ్చేష్టులయ్యారు. తన వాక్చాతుర్యంతో జనాల్ని ఆకర్షించే శక్తి ఆయనకు ఉంది. ఆ మాటలు, హావాభావాలు నిజంగా పెద్ద ఎన్టీఆర్ గారే మాట్లాడుతున్నారా అనేలా ఆయన ప్రసంగాలు ఉంటాయి. మరి అందరి మాట మన్నించి రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వరసగా హిట్స్ కొడుతూ హ్యాట్రిక్ కి సిద్ధమయ్యారు. ఇలానే ఆయన విజయపథంలో ముందుకు వెళ్ళాలని, కోరుకుంటూ 38వ పడిలోకి అడుగుపెడుతున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.