నిర్మాత ‘దిల్’ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు

తెలుగులో కుటుంబ కథ చిత్రాలకి దిల్ రాజు పెట్టింది పేరు. అలాగే ఏ నిర్మాతకు లేని హిట్ ట్రాక్
దిల్ రాజు గారికి ఉంది. ఆయన సినిమాలు దాదాపుగా అన్ని పెద్ద విజయం సాదించినవే. ఆయన అసలు
పేరు వెంకట రమణరెడ్డి. నిర్మాతగా తను నిర్మించిన ‘దిల్’ చిత్ర విజయం తర్వాత ఆయనకు దిల్ రాజు అని
ముద్ర పడింది. ఇండస్ట్రీలో ఉండే దాదాపుగా అగ్ర కథనాయకుల అందరితో ఆయన సినిమాలు
నిర్మించారు. దాదాపుగా 50 చిత్రాలను అయన నిర్మించారు. దిల్ రాజు గారి 50వ పుట్టినరోజున
ఇండస్ట్రీలో సెలెబ్రిటీస్ కి ఆయన ఘనంగా ఒక పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,
సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, యువ నటుడు విశ్వక్ సేన్, అలాగే సమంత, నాగ
చైతన్య జంట కూడా ఈ బర్త్ డే పార్టీ లో పాల్గొన్నారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి
వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అన్న ఆయన కోరిక ఈ
సినిమాతో తిరబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ కి విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే
2020 ట్విట్టర్ లో ఎక్కువ ట్విట్ చేసిన తెలుగు సినిమా గా వకీల్ సాబ్ సినిమా నిలిచింది. ఈ సినిమాకి
సంగీతం థమన్ అందిస్తున్నారు. నాని ఎమ్.సి.ఎ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు ఈ
సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మరిన్ని చిత్రాలను ఆయన నిర్మించాలని కోరుకుంటూ మీడియా9 తరపున
ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.