న్యాచురల్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు

‘అష్టాచెమ్మ’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు నాని. ఆయన అసలు పేరు ఘంటా నవీన్ బాబు. తండ్రి రాంబాబు, తల్లి విజయ లక్ష్మి. సొంతూరు కృష్ణా జిల్లాలోని చల్లపల్లి కాగా రాంబాబు గారు వృత్తి రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. మణిరత్నం సినిమాలు చూసి సినిమాల మీద ఇష్టం పెంచుకున్న నాని ఎలాగైనా దర్శకుడిగా సినిమాల్లో స్థిరపడాలని అనుకున్నాడు. మొదట తన స్నేహితుడి సహాయంతో రేడియో జాకిగా చేసాడు. ఆ తర్వాత ఆయనకి దూరపు బంధువైన ప్రొడ్యూసర్ అనిల్ గారి ప్రోద్భలంతో బాపు గారు తెరకెక్కించిన ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేరారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలకి సహాయకుడిగా చేశారు. అప్పుడే ఆయన్ని చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తను తీస్తున్న సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం సంప్రదించారు. ముందుగా కాదన్నా తర్వాత ఒప్పుకున్నారు. షూటింగ్ మొదలవుతుంది అనగా లీడ్ పేయిర్ డేట్స్ కారణంగా సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో సెకండ్ లీడ్స్ గా ఉన్న నాని, స్వాతి లను మెయిన్ లీడ్స్ గా తీసుకుని సినిమా పూర్తి చేసారు. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ఆ చిత్రంతో నాని కెరీర్ కూడా టర్న్ అయింది. దాని తర్వత రైడ్, స్నేహితుడా, భీమిలి కబ్బడి జట్టు చిత్రాలు చేసాడు. భీమిలి కబ్బడి జట్టు మంచి విజయం సాధించింది. ఇక 2011 లో వచ్చిన అలా మొదలైంది చిత్రం సోలో హీరోగా తనని ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది, ఈ చిత్రంతో ఆయన వెను తిరిగి చూసుకోలేదు. పిల్ల జమిందార్, ఈగా లాంటి బ్లాక్ బస్టర్స్ తో మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వెప్పం, ఆహ కళ్యాణం సినిమాలతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ప్రొడ్యూసర్ గా మారి అ!, హిట్ లాంటి మంచి చిత్రాలను నిర్మించారు. రేడియో జాకిగా మొదలై నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఆయన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న ఆయనకి మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.