
ఒక్క సినిమాతో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చో మనకు చాలా మంది నటులు చాలా సార్లు
నిరూపించారు. ఈ కోవకే చెందుతుంది రితిక సింగ్. విశేషమేమిటంటే రితిక సింగ్ ఒక కిక్ బాక్సర్.
ఆమెను చూసి దర్శకురాలు సుధ కొంగర తన కిక్ బాక్సింగ్ నేపధ్యమున్న చిత్రం కోసం సంప్రదించింది. ఆ సినిమానే సాలా ఖద్దూస్/ఇరుద్దు సుత్రు. తన మొదటి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయగలిగింది రితిక. ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు జనం నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ‘గురు’ పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసారు. గురు కూడా మంచి విజయం సాధించింది. ఇక రితిక సింగ్ కు అవకాశాల కోసం చూసుకునే అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా తమిళ్ లో అమ్మడికి బానే అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఓ మై కడవులే చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. అందానికి అందం, ముచ్చటైన అభినయంతో రితిక సింగ్ మరిన్ని పుట్టినరోజులు విజయవంతమైన సినిమాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు