
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించిన నభా నటేష్ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది నభా నటేష్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవలే నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తోంది. అంతే కాదు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటరే’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమా సాంగ్స్ , టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 25 న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. కరోన లాక్డౌన్ తర్వాత విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇదే. అది అలా ఉంటే ఈ భామ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిందీ సూపర్ హిట్ ‘అంధాధున్’ తెలుగులో రీమేక్‌లో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. బాలీవుడ్ లో లాగానే తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. తన అందంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే నభా నటేష్ మరిన్ని చిత్రాలు చేయాలనీ కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తయారుచేస్తోంది మీడియా9.