మాస్టర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్జీవి

90లలో తెలుగు సినిమాని మలుపు తిప్పిన దర్శకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. శివ సినిమాతో అప్పటివరకూ ఉన్న రికార్డులు, సినిమాపై ఉన్న అపోహలు ఒక్కసారిగా తొలగిపోయాయి. దర్శకుడు అవ్వాలంటే మినిమమ్ 35 ఏళ్ళు ఉండాలి అనే అపోహను కూడా ఆయన పటాపంచలు చేస్తూ నూతన అధ్యాయానికి తెరతీసారు. శివ మొదలుకుని క్షణక్షణం, సత్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని అందించారు.

విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకునే రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు వర్మ. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవటం ఎక్కువగా చేసేవారు. చదువు అంతంత మాత్రమే నైజీరియ వెళ్ళి డబ్బులు సంపాదించుకో అని ఇంట్లో వాళ్ళు అనడంతో దానికి ఒప్పుకున్నారు. అప్పుడే అమీర్ పెట్ లో ఒక డి.వి.డి రెంటల్ షాప్ చూసి అలాంటిది ఒకటి పెట్టాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా దాంతో డబ్బులు ఎలా సంపాదిస్తావు అన్న ప్రశ్నకు ఆయన ఒక లాజిక్ చెప్పారు.

తనకు ఉన్న ఫ్రెండ్స్ లో రోజుకి అయిదుగురు వచ్చినా, వాళ్ళు ఇంకొంతమందిని తీసుకొచ్చినా చాలు అని ఒక మొండి పట్టుదలతో డి.వి.డి రెంటల్ ని ఓపెన్ చేసారు. అయితే ఆయన అనుకున్నట్లు తన ఫ్రెండ్స్ ఎవరూ డి.వి.డిలు తీసుకుని డబ్బులు ఇచ్చేవారు కాదు కాని వారి వల్ల చాలా మంది ఆయన షాప్ కి వచేవాళ్ళు. అందులో కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఉండేవారు. అలా వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆర్.జి.వికి వాళ్ళ నాన్న గారి ద్వారా ఇండస్ట్రీలో ప్రవేశం దొరికింది. అయన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పని చేసేవారు. అలా రెండు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళినా అక్కడ ఆయనకు వర్కౌట్ అవ్వలేదు.

ఆ తర్వాత డైరెక్ట్ గా నాగార్జునకి కథ చెప్పే అవకాశం వచ్చింది. కథ విన్న నాగార్జున ఎక్జైట్ అయ్యి ఈ చిత్రం చేయటానికి ఒప్పుకున్నాడు. 27ఏళ్లకే డైరక్షన్ చేసే చాన్స్ కొట్టేసి సినిమాని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తెరకెక్కించారు. నాగార్జున మొదటి బ్లాక్ బస్టర్ శివ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా కొత్త శకానికి నాంది పలికింది శివ. ఫ్రేమ్స్, లైటింగ్స్ అన్ని ఒరిజినల్ గా ఉంటాయి.

శివ తర్వాత ఎన్నో గొప్ప సినిమాలను ఆయన తెరకెక్కించారు. సత్య సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిల్మ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి రేచల్ అనే ఫిల్మ్ క్రిటిక్ సత్య సినిమా భారతీయ పరిశ్రమపై ఒక రెవల్యూషన్ తెచ్చిన సినిమా అని, ఆ సినిమా ఒక కొత్త శైలిని క్రియేట్ చేసిందని అభినందిస్తూ, రాంగోపాల్ వర్మని మాస్టర్ గా ఆమె అభివర్ణించారు. ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఆయన మరిన్ని చిత్రాలను చేయలని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.