
రాంగోపాల్ వర్మ నిర్మాతగా రవితేజతో ఒక సినిమాని చెయ్యాలనుకున్నాడు. కోన వెంకట్ రాసిన కథను వినిపించాడు, కథ విన్న రవితేజ కథ బాగుంది దర్శకుడు ఎవరు అని అడిగారు. ప్రవాల్ రామన్ అని చెప్పగా ఎవరైనా తెలుగు వారైతే బాగుంటుంది అని చెప్పడంతో ఎవరిని తీసుకుందాం అని చర్చలు జరిగాయి. జ్యోతికను హీరోయిన్ గా తీసుకున్నారు మళ్ళీ ప్రాజెక్ట్ పోస్ట్ పొన్ చేస్తే ఆమె డేట్స్ మిస్ అయిపోతాయి. అప్పుడే రచయితగా, సహాయ దర్శకుడిగా కొన్ని సినిమాలకు పని చేసిన హరీష్ ను కథ వినమన్నాడు రవితేజ.

కథ విన్న హరీష్ కథ బాగుంది కాని రవితేజకి సూట్ అవ్వదు అని కొన్ని మార్పులు చేయాలి అని చెప్పడంతో రాంగోపాల్ వర్మ ముందుగా సీరియస్ అయినా తర్వాత ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయమని హరీష్ కే అప్పగించాడు. మొదట్లో హరీష్ కంగారుపడ్డాడు. అసలే రాంగోపాల్ వర్మ చిన్న మిస్టేక్ జరిగినా ఒప్పుకోడు సర్లే ఏం అవుతుందో చూద్దాం అని ఈ ప్రాజెక్ట్ ని చాలెంజింగ్ గా తీసుకున్నాడు. 2006లో విడుదలైన షాక్ ఆశించినంతగా కాకపోయినా ఓ మోస్తారుగా విజయవంతమైంది. దర్శకుడిగా హరీష్ తొలి ప్రయత్నంతో సక్సెస్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్’ 2011లో విడుదలైంది. ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడు. పవన్ కు నచ్చింది, అన్ని అనుకున్నట్లు జరిగితే మిరపకాయ్ లో పవన్ ఉండే వాడు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మళ్ళీ రవితెజ దగ్గరికే కథ వెళ్ళింది. కథలో రవితేజకి తగ్గట్లు చిన్న చిన్న మార్పులు చేసి ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాడు. మొదటి సినిమాకి రెండవ సినిమాకి మధ్య 5 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఇన్నేళ్ళ కసిని ఒక్క సినిమాతో తీర్చుకున్నాడు.

ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా దబాంగ్ ను రీమేక్ చేయలనుకున్నాడు పవన్. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు మొదట హరీషే మైండ్ లోకి వచ్చాడు. కథకి తనదైన స్టైల్ లో మార్పులు చేర్పులు చేసి మొత్తానికి కథ ఫైనల్ అయ్యి పట్టాలేక్కింది. ఈ సారి కూడా అతని లెక్క తప్పలేదు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. అయన మరిన్ని మంచి సినిమాలు తెయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు మీడియా9 నుండి తెలియజేస్తున్నాం.