అందాల తార మాళవిక శర్మ పుట్టినరోజు

తెలుగులో నెల టికెట్ సినిమాతో తెరంగేట్రం చేసి తన క్యూట్ లుక్స్ తో మరియు తన అందం, అభినయంతో అందరిని అలరించిన మాళవిక శర్మకి కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెని మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టేలా చేసింది. జనవరి 27, 1999 న ముంబైలో జన్మించిన మాళవిక శర్మ ఈ రోజు తన 22వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. అయితే మాళవిక శర్మ నటి మాత్రమే కాదు లాయర్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ ముంబై కాలేజ్ నుంచి ఆమె తన ఎల్.ఎల్.బి డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఒక అడ్వకేట్. మాళవిక శర్మకి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ కి వేలల్లో లైక్స్ వస్తాయి. ఇక మాళవిక శర్మ నటించిన ‘రెడ్’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. థియేటర్స్ లో 50 శాతం సీటింగ్ తో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాలో మాళవిక పాత్రకి మంచి పేరు వచ్చింది. రెడ్ సినిమా కథ అంత మాళవిక నటించిన పాత్ర మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాళవిక శర్మ తన తదుపరి సినిమాల్లో పాత్రల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. తను కెరీర్ పరంగా మరింత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీడియా9.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.