
సహ జనటి జయసుధ గారి పుట్టిన రోజు ఈ రోజు. తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటిగా
పేరు తెచ్చుకున్న జయసుధ గారి అసలు పేరు సుజాత. ఆమె 1958 డిసెంబర్ 17 న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. పండటికాపురం సినిమాలో జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏంట్రీ ఇచ్చింది. ఇది కథ కాదు సినిమాలో జయసుధ చిరంజీవితో కలిసి నటించింది. లక్ష్మణ రేఖ సినిమాలో చంద్రమోహన్ కి జోడిగా హిరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. అక్కడ్నిండి జయసుధ గారు తెలుగు, తమిళ, కన్నడ ఇలా భాషలతో సంబంధం లేకుండా దాదాపు మూడు వందల కు పైగా సినిమాల్లో నటించింది. ఒక్క హిరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలో బెస్ట్ మదర్ కారెక్టర్స్ చేస్తున్న నటిగా పేరొందింది. సినిమా రంగంలోనే కాదు, అటు రాజాకీయాల్లో కూడా రాణించింది. గతంలో ఆమె కాంగ్రెస్ తరుపున సికింద్రబాద్ ఎమ్.ఎల్.ఏ గా పని చేసింది. ఈ సహజ నటికి తన నటనకు, గ్లామర్ కు ఎన్నో అవార్డులు లభించాయి. తన అద్భుతమైన నటనకు ఏడు రాష్ట్ర నంది అవార్డులు మరియు ఏడు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఈ సహజ నటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9.