“పుట్టినరోజు శుభాకాంక్షలు” ‘మాస్ కా దాస్’

‘వెళ్ళిపోమాకే’ చిత్రంతో తెరంగేట్రం చేసి, ఈ నగరానికి ఏమైంది?, ఫలక్నుమా దాస్, హిట్ లాంటి చిత్రాలతో అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు విశ్వక్ సేన్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. దర్శకుడు అవ్వాలి అనుకునే యువకుడి పాత్రను ఆయన అద్భుతంగా పోషించారు. సహజమైన నటనతో ప్రేక్షకులు ఆ పాత్రకు కనెక్ట్ అయ్యేలా చేశారు. ఆయన నటన, హవభావాలు, బాడి లాంగ్వేజ్ అన్ని డిఫెరెంట్ గా ఉంటాయి. ఆ తర్వత వచ్చిన ‘ఫలక్నుమా దాస్’ లో మాస్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. హైదరాబాద్ కల్చర్ ను ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. దర్శకుడిగా విశ్వక్ తొలి ప్రయత్నం విజయవంతమైంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం ‘హిట్’. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చక్కటి విజయం సాధించింది. పోలిస్ ఆఫీసర్ పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ సక్సస్ ట్రాక్ లో పయనిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న పాగల్ సినిమాలో నటిస్తున్నారు. తన కెరీర్ లో మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ మీడియా9 నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.