
హీరోగా తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా కూడా చేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హీరో విజయ్ సేతుపతి. తెలుగులోనే కాదు విజయ్ సేతుపతికి ఇండియా అంత అభిమానులు ఉన్నారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ మొదలుపెట్టిన విజయ్ మెల్లగా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ మక్కల్ సెల్వన్ గా తన నటనతో అందరిని అలరిస్తున్నారు. జనవరి 16, 1978 లో జన్మించిన విజయ్ సేతుపతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇక ఆయన మొదట హీరోగా చేసిన ‘తెన్మెరుకు పరువకాట్రూ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనతో షార్ట్ ఫిలిమ్స్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ మొదటి సినిమా ‘పిజ్జా’ తో ఆయన సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. సూదు కవ్వం, విక్రమ్ వేద, సూపర్ డీలక్స్, 96 లాంటి సినిమాలు ఆయనకి హిట్స్ ఇవ్వడమే కాకుండా నటుడిగా ఎంతో పేరు తెచ్చాయి. అలాగే విజయ్ సేతుపతి స్టార్ హీరోస్ సినిమాల్లో కూడా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేశారు. రజినీకాంత్ గారి పెట్ట సినిమాలో, చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించి తను ఎలాంటి పాత్ర అయిన చేయగలను అని నిరూపించుకున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన మాస్టర్ చిత్రంలో కూడా విలన్ గా నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి హిందీ లో అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ చద్ద’లో నటిస్తున్నారు.