
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ తర్వాత కంచె, ఫిదా, సినిమాలతో వరుణ్ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తీసినవి తక్కువ సినిమాలైనప్పటికి వరుణ్ తేజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. జనవరి 19, 1990 న జన్మించిన వరుణ్ తేజ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్-3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 2019 లో వచ్చిన అనిల్ రావిపూడి కామెడి ఎంటర్టైనర్ ఎఫ్-2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ గారితో కలిసి మళ్ళీ నవ్వులు పంచబోతున్నాడు. ఈ మధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఎఫ్-3 లో కూడా వరుణ్ తేజ్ కి జోడిగా మెహెరీన్ నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ బాక్సర్ గా కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కి ఈ బర్త్ డే రోజున ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్, మరియు టైటిల్ ని తన అన్న రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సయీ మంజ్రేకర్ వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తుంది. వరుణ్ కి మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు.