
అక్కినేని వారసుడిగా సుమంత్ తర్వాత వచ్చిన నటుడు సుశాంత్. 2008లో వచ్చిన కాళిదాసు సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. రెండో సినిమా కరెంట్ తో డీసెంట్ హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చిత్ర విజయమే ఆయన్ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది. ఆ సినిమా తర్వాత ఆయన దాదాపు 4 సంవత్సరాలు సినిమాలు చేయలేదు 2013 లో వచ్చిన అడ్డా కూడా అంతగా హిట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత చేసిన ఆటడుకుందాం రా సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆయన కెరీర్ గల్లంతే అనుకున్న టైమ్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ చక్కటి విజయం సాధించింది. ఒక్క రోజులో ముగిసిపోయే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వైవిధ్యమైన కథనంతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువైంది. ఈ చిత్రంతో చక్కటి నటనను కనబరిచారు సుశాంత్. ఈ చిత్రం విజయం సాధించడంతో పాటు స్క్రీన్ ప్లే విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన అలవైకుంఠపురములో చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం విజయం సాధించి ఆయన కెరీర్ కు దోహదపడాలని కోరుకుంటూ మీడియా9 నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.