
మాస్ అన్న పదం వినబడితే టాలీవుడ్ లో కచ్చితంగా గుర్తొచ్చే పేరు రవితేజ. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన కెరీర్ లో మరెన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం సినీ ఇండస్ట్రీలో మొదలైంది. నాగార్జున నిర్మించిన నిన్నే పెళ్లాడతా చిత్రానికి పనిచేసినందుకు తొలి చెక్ ను అందుకున్నాడు. అక్కడినుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు నుండి హీరోగా రవితేజ తన కెరీర్ ను నిర్మించుకున్న తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. తన కష్టాన్ని నమ్ముకుంటే కచ్చితంగా పైకి రావొచ్చని నిరూపించాడు రవితేజ. కమర్షియల్ చిత్రాల్లో తనదైన ముద్రను వేసుకున్న రవితేజ తన టిపికల్ స్లాంగ్ తో ఫ్యాన్స్ ను సంపాదిన్చుకోగలిగాడు. క్రమంగా మాస్ కు చేరువయ్యే సినిమాలను చేసి ఆపై మాస్ మహారాజాగా మారాడు. ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రవితేజ ప్రస్తుతం తన కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాడు. వరస ప్లాప్స్ ఈ మధ్య ఇబ్బంది పెట్టినా, రవితేజ ఈ సంక్రాంతికి 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడీ' చిత్రంలో నటిస్తున్న రవితేజ ఫ్యూచర్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ మీడియా9 నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం