
పీపుల్స్ స్టార్ , రెడ్ స్టార్, దళిత వర్గాల కోసం, బడుగు బలహీనుల కోసం పోరాట సినిమాలు చేసే యాక్టర్, డైరెక్టర్ ఆర్.నారాయణ మూర్తి పుట్టిన రోజు ఈ రోజు. 1954 డిసెంబర్ 31 న గోదావరి జిల్లాలో రౌతులపుడి మండలం లో మల్లం పేట లో రెడ్డి చిన్నయ్య నాయుడు, చిట్టెమ్మ దంపతులకు జన్మించారు రెడ్డి నారాయణ మూర్తి గారు. నారాయణ మూర్తి గారిది రైతు కుటుంబం. నారాయణ మూర్తి తన స్కూల్ వయస్సు లోనే సామన్యులకు జరిగే అన్యాయలను ఎదిరించడానికి విప్లవాల వైపు మొగ్గు చూపారు. నారాయణ్ మూర్తి కి ఎ. ఎన్. ఆర్, ఎన్.టి.ఆర్ సినిమాలు అంటే విపరీతమైన అభిమానం. వాళ్ళ సినిమాలు చూసి నారాయణ మూర్తి వాళ్ళ లాగే ఇమిటేట్ చేసేవారు. నారాయణ మూర్తి మెదటి సారి నీడ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకి దాసరినారాయణరావు దర్శకత్వం వహించారు. తర్వాత దర్శకుడిగా, హిరోగా, నిర్మాతగా వ్యవహారిస్తూ అర్థరాత్రి స్వంతంత్ర్యం సినిమా చేశారు. ఆ సినిమా సక్సెస్ అయ్యాక నారాయణమూర్తి తిరిగి చూసుకోలేదు. తరువాత వరుస పెట్టి సినిమాలకు దర్శకత్వం చేస్తూ నటించారు. తర్వత దండ కారుణ్యం, అడవి దివీటీలు, ఎర్ర సైన్యం, ఓరేయ్ రిక్షా, వీర తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. నారాయణ మూర్తి సినిమాలు అన్ని ప్రజల కోసం తీసినవే కావడం విశేషం. చైతన్యవంతమైన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. ఆయన అలానే మరిన్ని సినిమాలు చేయాలనీ, ఇటువంటి పుట్టినరోజు ఇంకా ఎన్నొ జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ పీపుల్స్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9.