
నటుడిగా, నిర్మతగా, విద్యాసంస్థల అధినేతగా తెలుగు వారికి సుపరిచితుడు పద్మశ్రీ మోహన్ బాబు గారు. చిత్తూరు జిల్లాలోని మొగదులపాళెంలో 1952, మార్చ్ 19న మంచు నారాయణ స్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యను తిరుపతిలో పూర్తి చెసుకున ఆయన, మద్రాసు నుండి ఫిజిక్స్ లో డిగ్రీ పట్టా పొందారు. 1970లలో పరిశ్రమ బాట పట్టి కొన్నేళ్ళు దర్శకత్వ శాఖలో పని చేసారు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించిన స్వర్గం – నరకం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి వరకూ భక్తవత్సలం నాయుడుగా ఉన్న తన పేరును మోహన్ బాబుగా మార్చుకున్నారు. అక్కడి నుండి హీరోగా, విలన్ గా దాదాపు 600 చిత్రాల్లో నటించారు. విలన్ గా ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు మోహన్ బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన హావాభావాలను పలికించే విధానం అన్ని కొత్తగా ఉండేవి. అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారు, పెద్దరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, మేజర్ చంద్రకాంత్, ఎమ్. ధర్మరాజు ఎమ్.ఎ, కలెక్టర్ గారు, శ్రీ రాములయ్య, లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించి కలెక్షన్ కింగ్ గా పేరొందారు. అప్పట్లో చిరంజీవి గారి చాలా సినిమాల్లో మోహన్ బాబు గారు ఉండేవారు. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఒకపక్క హీరోగా చేస్తూనే విలన్ పాత్రలను కూడా చేసేవారు. యమదొంగ చిత్రంలో యముడిగా అయన నటన మరో అద్భతం. పాత్రేదైనా తన శైలిలో నటించి ఆ పాత్రకు జీవం పోస్తారు మహాన్ బాబు. ఇటీవలే వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరెన్నో మంచి పాత్రలను పోషించాలని కోరుకుంటూ ఈ వెండితెర అధిపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలినయజేస్తోంది మీడియా9.