యాంగ్రీ యంగ్ మ్యాన్ కు జన్మదిన శుభాకాంక్షలు

తన నటనతో, హవాభావలతో టాలివుడ్ లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి తనకంటూ సుస్థిర స్థానం సొంతం చేసుకున్న నటుడు డా. రాజశేఖర్ గారు. విలక్షణ దర్శకుడు టి. కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన, తోలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ తర్వాత వందేమాతరం, అరుణ తిలకం, రేపటి పౌరులు, తలంబ్రాలు, ఆరాధన, ఆహుతి లాంటి వివిధ విభిన్న చిత్రాల్లో నటించారు. చక్కటి కథలతో ఇటు ప్రేక్షకులను అలరిస్తూనే విమర్శకులను కూడా మెప్పించారు. 1989 లో విడుదలైన ‘అంకుశం’ సినిమాతో ప్రభంజం సృష్టించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ టాలివుడ్ అని బిరుదును పొందారు. ఈ చిత్రంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు రాజశేఖర్. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అంకుశం తర్వాత ఆయన పలు చిత్రాలు చేసారు. వాటిలో మగాడు, ఆగ్రహం, ఓంకారం, శేషు చిత్రాలు ఆయన్ను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘పి.ఎస్.వి గరుడవేగ’ చిత్రం చక్కటి విజయం సాధించింది. ఇలానే ఆయన తన జైత్రయాత్రను కొనసాగించాలని కోరుకుంటూ ఆయనకు మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.