స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పటు కేరళలో కూడా ఆయనకు అంతులేని అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరో అవుతానని అన్నప్పుడు అతని తల్లి నిర్మలకు ఆ నిర్ణయం అస్సలు నచ్చలేదు. అల్లు అరవింద్ గారు కూడా వద్దు అనే అన్నారు. కాని ఆయనలోని ఆ మొండి పట్టుదలే ఆయన్ని స్టైలిష్ స్టార్ ని చేసింది. గంగోత్రి మొదలుకుని మొన్నటి అల వైకుంఠపురములో సినిమా వరకూ అయన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నెన్నో మలుపులు.

1985లో రెండేళ్ల వయసులోనే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ‘విజేత’ చిత్రంలో ఒక చిన్న సీన్ లో నటించాడు అల్లు అర్జున్. విజేత సినిమా షూటింగ్ కు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ ను చూసి దర్శకుడు కోదండరామి రెడ్డి ఈ సినిమాలో నటింపజేశాడు. అదే ఏడాది కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాలో కూడా అల్లు అర్జున్ నటించాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు డ్యాన్స్ లు అంటే చెవి కోసుకునేవాడు బన్నీ. అలా నటన పై కూడా ఆసక్తి పెరిగింది.

ఆర్య సినిమాతో యువతకు దగ్గరై వేదం, ఆర్య-2, లాంటి చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. దేశముదురు, జులాయి, రేసుగుర్రం, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ తో తన మార్కెట్ ని ప్యాన్ ఇండియా వైడ్ గా పెంచుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతోంది. దీంతో ఆయన బాలివుడ్ లో కూడా పాగా వేసే అవకాశం ఉంది. ఆయన పుట్టిన రోజు కానుకాగా పుష్ప నుండి చిన్న టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఆయన మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.