
నటన లో అభినయం, రౌద్రం లో అరుంధతి, అందం లో బహుబలి ప్రియురాలు దేవసేన మొత్తంగా తెలుగు ప్రేక్షకుల స్వీటీ అనుష్క శెట్టి పుట్టిన రోజు ఈ రోజు. 1981 లో నవంబర్ 7 న కర్ణాటకలో జన్మించింది. అనుష్క శెట్టి తెలుగు సినిమా లో తనదైన ముద్ర వేసింది. తెలుగు ప్రేక్షకుల్ని తన నటన తో, డాన్స్ తో, అందంతో మంత్ర ముగ్దుల్ని చేసింది. హిరోయిన్ అంటే పాటలకు మాత్రమే సొంతం అనుకునే రోజుల్లో అనుష్క తెలుగు సినిమా కి పరిచయం అయ్యి హిరోయిన్ అనే పదానికి సంపూర్ణ అర్థం తీసుకొచ్చింది. ఒక పక్క స్టార్ హిరోస్ తో నటిస్తూ మరో పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని అలరించింది. ముందుతరం లో విజయశాంతి హిరోయిన్ పాత్ర మీద వచ్చె సినిమాలు చేసేవి. 2005 సంవత్సరం లో పూరిజగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో నాగర్జునకి జోడిగా నటించింది. అనుష్క విక్రమార్కుడి చిత్రంతో హిట్ అందుకుంది. 2009 లో వచ్చిన అరుంధతి చిత్రం తో అనుష్కకి స్టార్ డమ్ వచ్చింది. అక్కడినుండి వరస సినిమాలతో తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పాటు చేసుకుంది. అరుంధతి చిత్రంలో తన నటనకు నంది జ్యూరీతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. బహుబలి చిత్రం తన కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది. హిరోలతో పోటిగా నటించి హిరోయిన్స్ అంటే గ్లామర్ కాదు నటన అని చెప్పిన నటి అనుష్క శెట్టి. తన తోటీ నటీమణులకు కూడా అనుష్క శెట్టి ఫెవరెట్ హిరోయిన్ గా ఉండడం స్వీటీ ప్రత్యేకత, గొప్పదనం. అనుష్క శెట్టి తెలుగు ప్రేక్షకుల స్వీటీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.