
ప్రధాని నరేంద్ర మోడీకి 70 ఏళ్లు నిండినందున సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు పోస్ట్ చేశారు. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా బాలీవుడ్ నుండి అనిల్ కపూర్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, అభిషేక్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అందరూ తమ శుభాకాంక్షలు పంచుకున్నారు.
Wishing our honourable PM Shri @narendramodi Ji, a very happy birthday. In everything he does, he thinks of the best interests of the nation and it's people. Thank you for your service, now and always Modiji.#HappyBirthdayPMModi pic.twitter.com/DbaOl7cdPF
— Anil Kapoor (@AnilKapoor) September 17, 2020
గురువారం 70 ఏళ్లు నిండిన భారత ప్రధాని మోడీకి స్టార్స్ అంతా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. కంగనా రనౌత్ తన మనాలి ఇంటి నుండి తెల్లవారుజామున ఒక వీడియోను పంచుకున్నారు. ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ఆయనను ప్రధానిగా చేసుకోవడం దేశం అదృష్టమని అన్నారు. అనిల్ కపూర్ ప్రధానితో కలిసిన తన చిత్రాన్ని పోస్ట్ చేశారు..
Hon. PM Shri @narendramodi ji, Our Wholehearted Birthday Wishes !! from all of us.
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2020
May our ‘Motherland Bharath’ see it’s true glory, as envisioned by Revolutionary Saint ‘Shri Aurobindo,’ under your Charismatic , Inspiring & Dedicated Leadership.🙏
రాజకీయ ప్రముఖులు, బిజినెస్ టైకూన్లు, సెలబ్రిటీలు, అభిమానులు మరియు సాధారణ ప్రజల విషెస్ తో సోషల్ మీడియా నిండిపోయింది. అసాధారణమైన ప్రజాభినం సంపాదించిన మోడీ గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో ని వడ్ నగర్ లో జన్మించారు. తల్లి హిరాబెన్ తండ్రి దామోదర్దాస్ మోడీ. తన చిన్న నాటి రోజుల్లో ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) లో చురుకైన సభ్యుడైన మోడీ 2001 వరకు బిజెపి లో పలు పదవులను నిర్వహించి, ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ వెంటనే శాసనసభకు ఎన్నికయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి ఆయన దేశ ప్రధాని అయ్యారు.2019 లో మరో మారి విజయం సాధించి ఆయనే ప్రధానిగా ఇప్పుడు దేశానికి సేవలు అందిస్తున్నారు. మీడియా9 టాలీవుడ్ తరపు నుండి మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
