

సాగర్ కె చంద్రా సాధారణ ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియక పోవచ్చు కాని సినీ ప్రేమికులకు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అమరావతి, అనసూయ లాంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సాగర్ అయ్యారే చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు పొందారు. 2012 లోనే దర్శకుడిగా తన పయనం మొదలు పెట్టిన ఆయన ఇప్పటి వరకూ తీసింది కేవలం రెండు చిత్రాలు మాత్రమే కాని రెండూ విభిన్నమైన చిత్రాలు. కథా, కథనాల్లో ఎక్కడా ఎటువంటి సారూప్యత ఉండదు.


రాజేంద్ర ప్రసాద్, శివాజీలు ప్రధానపాత్రల్లో పోషించిన అయ్యారే చిత్రంలో తన కూతురి కొసం దొంగ స్వామీజీగా మారిన ఒక నది వయస్కుడు, డబ్బు కోసం అతన్ని ఆ వేషం కంటిన్యూ చేయమని బెదిరించే ఒక కరెప్ట్ పోలిస్, వాల్యుయేషన్ లో తప్పులు జరగడం వల్ల ఎంసెట్ లో టాపర్ అయిన ఒక యువకుడు వీళ్ళ చుట్టూ జరిగే కథ. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలను, భక్తి పేరుతో జరుగుతున్న మోసాలను ఆయన ఇందులో ప్రస్తావించారు.


అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో క్రికెటర్ అవ్వాలని కలలు కన్నా ఒక యువకుడు అనుకోని కారణాల వల్ల గ్యాంగ్ స్టార్ గా మారతాడు. తన తండ్రి చావుకి కారణమైన నక్సలైట్లను ద్వేషించే ఒక పోలిస్ ఆఫీసర్ వీరి మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా. చుట్తో ఉన్న సమాజం సగటు మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన ఈ చిత్రంలో చూపించారు. శ్రీవిష్ణు, నారా రోహిత్ లు వారి పాత్రలకు జీవం పోశారు.

ఇప్పుడు ప్రస్తుతం ఆయనచేస్తున్న ఏ.కె రీమేక్ లో పవన్, రానాలని సాగర్ చంద్ర ఎలా డీల్ చేస్తాడో అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి కథలు తెరకెక్కించడంలో సాగర్.కె చంద్రది అందవేసిన చేయి. ఆయన తీసిన అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. వీరిని డీల్ చేసేటప్పుడు ఎంత గొప్ప దర్శకుడికైనా ఎంతో కొంత ప్రెజర్ ఉండటం సహజమే మరి ఆ ప్రెజర్ ని సాగర్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.