అనుకోకుండా హీరోయిన్ అయిన అందాల తార చార్మి

15 ఏళ్ళ వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది అందాల తార చార్మి. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఆమె పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ‘నీ తోడు కావలి’ అనే తెలుగు చిత్రం ద్వారా నటనా రంగంలోకి వచ్చిన ఆమె తన రెండవ సినిమా తమిళంలో చేసింది. అక్కడ కూడా నటిగా ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఆ తర్వాత మలయాళంలో కూడా చేసిన చార్మి వరసగా తమిళంలో సినిమాలు చేసింది. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన చార్మి అన్ని దక్షిణాది భాషలతో పాటుగా బాలివుడ్ లో కూడా నటించింది.

ఆమె మొదటి సినిమా అవకాశం అనుకోకుండా వచ్చింది. ముంబైలోని ఆమె ఇంటి దగ్గర ఆమెను చూసిన సదరు నిర్మాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను తన సినిమాకు హీరోయిన్ గా ఒకే చేయించుకున్నాడు. ఆమె కెరీర్ లో నటిగా ఆమెను శిఖర స్థానంలో నిలబెట్టిన చిత్రం అనుకోకుండా ఒక రోజు. 2005 జూన్ 30న విడుదలైన ఈ చిత్రంలో జగపతి బాబు, శశాంక్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి తన మార్క్ ను మళ్ళీ చూపించాడు. ఈ చిత్రం వీళ్ళ కెరీర్ లో ఒక మైలురాయిలా నిలిచిపోయిన చిత్రం అని చీప్డంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆ తర్వాత వరసగా స్టార్ హీరల సరసన నటించింది చార్మి. గ్లామర్ డాల్ గా దూసుకుపోతున్న సమయంలో ఆమె చేసిన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘మంత్ర’ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. అయితే మంత్ర సినిమాలో ఆమెను ఆ రేంజ్ క్యారెక్టర్ లో చూసిన అభిమానులకు ఆమె తర్వాత చేసిన సినిమాలు పెద్దగా నచ్చలేదు. మళ్ళీ ఆమెను అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లోనే చూడాలని అనుకున్నారు. దాన్హో ఆమెకు ఫ్లాప్స్ రావడం మొదలయ్యాయి. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడితో కూడా తెరను పంచుకుంది చార్మి.

ఇక ఆమె చివరగా హీరోయిన్ గా చేసిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. ఈ చిత్రం పర్వాలేదనిపించుకున్నా ఆ చిత్రంతోనే ఆమెకు హీరోయిన్ గా ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత ఆమె ప్రొడ్యూసర్ గా మారింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. పైసా వసూల్ తో హిట్ కొట్టి ఇస్మార్ట్ శంకర్ తో డబుల్ బ్లాక్బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ అయ్యి ఆమె నిర్మాతగా మరిన్ని హిట్స్ అందుకోవాలని ఆశిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.