ఇదంతా ఒక్కరోజు ముచ్చట్నా ఏంది..?


బిగ్ బాస్ కాంటెస్టెంట్లకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. మొదటి సీజన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన వారికి వృత్తి పరంగా కూడా ఆఫర్లు రావడమో, లేదంటే వాళ్లు చేసే సినిమాలకో, యూట్యూబ్ వీడియోస్ కో మంచి ఆదరణ లభించడమో జరుగుతున్నాయి. మొదటి సీజన్లో గెలిచిన శివ బాలాజీ, రన్నర్ అప్ అయిన హరితేజలకు ఆ తర్వాత కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అలానే కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ ఇలా అందరూ మంచి ఆఫర్లతో కెరీర్ లో ముందుకి వెళ్తున్నారు.

ఇప్పుడు వారితో పాటు బిగ్ బాస్ హారికకు ఒక అరుదైన అవకాశం వచ్చింది. హారిక కూడా జనాల్లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నది. తెలంగాణ టూరిజం కి బ్రాండ్ అంబాజిడర్ గా నియమితురాలు అయ్యింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (టి.ఎస్.టి.డి.సి) చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త గారు ఆమెని నియమించారు. అది కూడా మహిళా దినోత్సవం నాడు ఈ కార్యక్రమం జరిగింది.

ఇక ఈ విషయం జరిగిన తర్వాత ఆమెకు బంధువులు, మిత్రులు ఆమెను అభినందించారు కూడా.చిన్న వయసులోనే ఆమెకు ఇలంటి గౌరవం దక్కడం కూడా గర్వించదగిన విషయం. కాని ఈ ముచ్చట ఒక దినానికే అన్నట్లుగా నిన్నటి జరిగిన సంఘటణ చూస్తే తెలుస్తోంది. అసలు హారికను బ్రాండ్ అంబాజిడర్ గా నియమించిన విషయం తెలంగాణ టూరిజం మంత్రికి తెలియదని, టి.ఎస్.టి.డి.సి చైర్మన్ సంప్రదింపులు లేకుండానే ఆమెను ఈ పదవిలో నియమించారనితెలుస్తోంది.

అలాగే టి.ఎస్.టి.డి.సి వెబ్ పోర్టల్ నుండి ఆమె పేరును కూడా తొలగించారు. ఇదంతా చూస్తుంటే ఒక్క రోజుకి మాత్రమె ఆమె బ్రాండ్ అంబాజిడర్ గా ఉంది. క్లారిటీ లేకుండా వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు హారిక బద్నామ్ అయినట్లు అయ్యింది ఎవ్వారం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.