
కొందరు నటులు వాళ్ళు పోషించిన పాత్రల్లోనే జనాలకి ఎక్కువగా గుర్తుండిపోతారు. పౌరాణిక పాత్రల్లో ఎన్.టి.ఆర్, దేవదాస్ గా ఏ.ఎన్.ఆర్, ఘటోత్కచుడిగా ఎస్.వీ.ఆర్ ఇలా అప్పటి తరం నుండి ఇప్పటి వరకు వారి పాత్రలతోనే ప్రేక్షకుల మైండ్స్ లో రిజిస్టర్ అయిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో రానా దగ్గుబాటి కూడా ఒకరు. బాహుబలిలో భళ్ళాల దేవుడిగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దక్షిణాదినే కాకుండా యావత్ భారతదేశం అంతా ఆయన నటనకు ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో అయన పలికిన రౌద్రం, ఆయన ఆహార్యం, తనను తానూ మర్చిపోయి ఆ పాత్రకు జీవం పోశారు రానా.
పాత్రేదైనా దానికి తగ్గట్లుగా తన దేహాన్ని మార్చుకుంటారు రానా. పాత్రకు తగినట్లుగా బరువు తగ్గడం, పెరగడం తనకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుందని. ఆయన అంటుంటారు. బాహుబలి తర్వాత ఆయన నటించిన ప్యాన్ ఇండియన్ చిత్రం ‘అరణ్య’. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో నిర్మితమైంది. ఈ చిత్రంలో ఆయన బాన్ దేవ్ అనే పాత్రను పోషించారు. 30 సంవత్సరాల పాటు అడివిలోనే ఉన్న పాత్ర అది. ఆ పాత్ర కోసం ఆయన బరువు తగ్గి సన్నగా అయిన విషయం తెలిసిందే. ఇందు కోసం ఆయన చేసిన వర్క్ఔట్స్, ఆయన పాటించిన ఆహార నియమాలు వాటి గురించి ఆయన పంచుకున్నారు.

బరువు తగ్గడం, పెరగడం అనేది తనకు కొత్త విషయం కాదని, సినిమాల్లోకి రాక ముందు 125 కిలోల బరువు ఉండే వాడినని, అప్పుడు తన సొంత వి.ఎఫ్.ఎక్స్ సంస్థను నడిపేవాడినని దాన్ని అమ్మేసి పూర్తిగా సినిమాల్లోకి రావలుకున్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో దాదాపు 25 కిలోలు తగ్గానని ఆయన అన్నారు. బాన్ దేవ్ పాత్ర విషయానికి వస్తే దర్శకుడు ప్రభు సోల్మన్ ఈ పాత్ర గురించి చెప్పినప్పుడే బరువు కూడా తగ్గాలని చెప్పారని, ఆయన చెప్పిన దాని ప్రకారం డైట్ ను ఫాలో అవుతూ, డైలీ రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, కార్డియో వంటివి చేసే వాడినని ఆయన అన్నారు. బాహుబలి అయిపోయిన తర్వాత రోజుకి 2 గంటలుకు పైగా జిమ్ లోనే గడిపే వాడిని ఈ పాత్ర కోసం నాన్ వెజ్ మానేసి కేవలం వెజ్ మాత్రమె తిన్నానని ఆయన అన్నారు. జిమ్ అనేది నా వృత్తిలో భాగమని ఆయన అన్నారు.