భారతీయుడు షూటింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చేసింది..!!

స్టార్ డైరెక్టర్ శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు 2.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1996లో విడుదలై సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమా కి సీక్వెల్.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేస్తుండడం విశేషం.. ఇంత పెద్ద సినిమాను మొదలు పెట్టను అయితే మొదలు పెట్టారు  గాని మొదలుపెట్టిన దగ్గర్నుంచీ సినిమాకి అడుగడుగునా అవాంతరాలు  ఏర్పడుతున్నాయి..

కరణ్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ సినిమా ఇప్పటివరకూ మొదలు కాకపోవడంతో ఈ సినిమా ఆటక ఎక్కినట్లే అనుకుంటున్నారు.. దాంతో ఈ సినిమా ను పక్కన పెట్టి రెండు సినిమాలను ప్రకటించారు డైరెక్టర్ శంకర్.. ఓ వైపు రామ్ చరణ్ తేజ్  పాన్  సినిమా చేస్తూనే  రెండోవైపు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి..

అయితే ఈ రెండు సినిమాలు ప్రకటించిన వెంటనే శంకర్ కి భారతీయుడు-2 నిర్మాతలు తమ సినిమాను ఎప్పుడు ఫినిష్ చేస్తారంటూ లీగల్ నోటీసులు పంపించారు.. సినిమా ఆగిపోయింది అని అందరూ అనుకుంటున్న తరుణంలో తాజాగా శంకర్ తరపు న్యాయవాది పరిస్థితులు అనుకూలించిన తర్వాత సినిమాను పూర్తిచేస్తామని చెప్పినట్లు సమాచారం.. అంటే ఈ లెక్కన భారతీయుడు సీక్వెల్  ఆగిపోలేదని అర్థమవుతుంది .. కమల్ ఫ్యాన్స్ కు ఇది ఊరటనిచ్చే అంశం..

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.