రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాలు

‘చిరుత’ చిత్రంతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. మెగా స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన నటుడిగా తన మార్క్ ను వేయడానికి చాలా కాలం పట్టింది. రెండో చిత్రమే బ్లాక్ బస్టర్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రం అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డ్ లను తుడిచి పెట్టేసింది. ఈ చిత్రంతో చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఈ చిత్ర విజయం వల్లే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన ఇమేజ్ ను కాపాడుకోగలిగాడు.

అ తర్వాత చేసిన ‘ఆరెంజ్’ సినిమా పెద్ద ఫ్లాప్. నిర్మాత సొంత బాబాయి నష్టాలు తప్పలేదు. వరసగా మూడు హిట్లు కొట్టనున్నాడు అని అందరూ అనుకున్నారు. కాని పరిస్థితి తారుమారైంది. కాని పాటలు మాత్రం అప్పట్లో ఓక ఊపు ఊపాయి. ఎక్కడ చూసినా అవే పాటలు. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా జెన్యూన్ గా ఉంటుంది. అందుకే ఈ చిత్రం ఎప్పటికీ ఆయనకు స్పెషల్ ఫిల్మ్.

ఇక వరస ఫ్లాప్స్ లో ఉన్న చరణ్ కు కరెక్ట్ టైమ్ లో వచ్చిన హిట్ ‘ధృవ’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. మామూలుగానే తన హీరోలను స్టైల్ గా చూపించే సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో చరణ్ ను ఇంకాస్త స్టైల్ గా చూపించాడు. ఈ చిత్రంలో ఆయన ఫిజిక్ చూసి అందరూ షాక్ అయ్యారు.

ధృవ తర్వాత వచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసాడు. ఈ చిత్రంతో నటుడిగా తన మార్క్ ను వేసాడు. చెవిటి వాడిగా ఆయన నటన అద్భుతం. ఈ నాలుగు చిత్రాలు ఆయన కెరీర్ లో మర్చిపోలేని సినిమాలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.