
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేకపోయినా అయన సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉండగా తెలుగులోనే సరిగ్గా కుదురుకుని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి వెళ్లడమేంటి అని తెగ అనుమానాలు ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు..

ఏదైతేనేం బెల్లంకొండ కొండత ఆశతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.. అయితే ఆ సినిమా ని అయన పక్కనపెట్టినాలు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలుగులో 'అల్లుడు అదుర్స్ ' సినిమా చేసిన శ్రీనివాస్, ఆ తరువాత సినిమాను హిందీలో చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగులో ప్రభాస్ చేసిన 'ఛత్రపతి' సినిమాను, వినాయక్ దర్శకత్వంలో హిందీలో చేయాలనుకున్నాడు.

ఆ తరువాత తమిళంలో ధనుశ్ చేసిన 'కర్ణన్'ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడట. 'ఛత్రపతి' రీమేక్ ను కొంతకాలం పాటు హోల్డ్ లో పెట్టేసి, ముందుగా 'కర్ణన్' రీమేక్ చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపిస్తోంది.