
లాక్ డౌన్ కి ముందు రిలీజ్ అయిన ఆఖరి హిట్ చిత్రం ‘పలాస 1978’. కె.వి.కరుణ కుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలోని పలాస చుట్టూ పక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. రక్షిత్, నక్షత్రలు నాయకా నాయకులుగా నటించగా తిరువీర్, ప్రవీణ్ యండమూరి లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడమే కాక ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు రఘు కుంచె.
శ్రీకాకుళం జానపద గీతాలను ఈ చిత్రం కోసం తనదైన శైలిలో స్వర పరిచారు రఘు కుంచె. ఈ సినిమాలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట ఇప్పటికీ పలు సోషల్ మీడియాల్లో, యూట్యుబ్ లో ఒక ఊపు ఊపింది. సినీ ప్రేక్షకులందరిని ఈ పాట అలరించింది. ఈ పాటను 15 కట్ల మందికి పైగా వీక్షించారు. ఇప్పుడీ చిత్రంలోని ‘బావొచ్చాడు’ అనే పాట కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. బావొచ్చాడు వీడియో పాట 10మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలై 6 నెలలకు పైగా కావొస్తున్న ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.