బండ్ల గణేష్ మళ్ళీ భజన చేసాడుగా..!

పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి అభిమాన గణం ఆయనది. ఆయన కోసం ఏమైనా చేసే అభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ కూడా ఒకడు. వీలుచిక్కిన్నప్పుడల్లా పవర్ స్టార్ ను మోయడం ఆయనకు అలవాటే. ఆయన మాటలాడే మాటలు పవన్ కు సైతం నవ్వు తెప్పిస్తాయి. ఎన్నో సార్లు పవన్ పగలబడి నవ్వుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

మరోసారి అది రిపీట్ అయ్యింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాబోతోంది. అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. బాలివుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్ కి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. నానితో ఎంసీఏ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవలే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.

ఇక ఈ ఈవెంట్ కి వచ్చిన బండ్ల గణేష్ మరోసారి రెచ్చిపోయాడు. మైక్ పట్టుకుని తనదైన శైలిలో భజన చేసాడు. ఈశ్వరా....పవనేశ్వరా...పవరేశ్వరా అంటూ మొదలు పెట్టి తన ప్రతీ రక్తపు చుక్కని చెమటగా మార్చి ఆ చెమటని నటనగా మార్చి తనని నమ్ముకున్న వారిని కాపాడుకుంటాడు అని రెచ్చిపోయాడు. ఆయన మాట్లాడుతుంటే పవన్ కళ్యాన్ నుండి దిల్ రాజు సహా అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఆయన ఇలా భజన చేయడం ఎప్పుడు మానుకుంటాడో అని అభిమానులు సైతం అనుకుంటున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.