
ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అయన మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాగార్జున.. అయన నటించిన గత చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో ఈ సినిమా హిట్ తప్పనిసరి అయింది.. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ని గట్టిగా చేయాలనీ చూస్తున్నాడు నాగార్జున.. ఈ నేపథ్యంలోనే వెరైటీ గా వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు.అలీరెజాతో పాటు సయామీ ఖేర్ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు మెగా స్టార్ చిరంజీవి.. అది చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు నాగార్జునను ప్రశంసిస్తూ విషెస్ తెలిపారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఈయన కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాగార్జున స్టైల్‌తో పాటు ట్రైలర్ మేకింగ్ కూడా మెచ్చుకున్నాడు. ఈ చాట్ కి సంబందించిన స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు నాగార్జున.అవి కాస్తా వైరల్ అయ్యాయి. అది కూడా వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాతే పోస్ట్ చేసాడు మన్మథుడు.

అయితే దీనికి బాలకృష్ణ కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..మహేష్ తన వాట్సాప్ డీపిగా గర్జిస్తున్న సింహం ఫోటోను పెట్టుకున్నాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాగార్జున వల్ల తమ హీరో వాట్సాప్ డీపి బయటికి వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ డీపీ చూసి సూపర్ అంటున్నారు. ఎందుకంటే గర్జిస్టున్న సింహం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలయ్యే. సింహం అనే పదానికి నిదర్శనంగా బాలయ్య ఉంటాడంటారు అభిమానులు. ఇకపోతే .సాల్మన్ దర్శకత్వంలో రాబోతున్న వైల్డ్ డాగ్ సినిమా లో సయామీ ఖేర్ కీలక పాత్రధారి గా చేస్తున్నారు.