
తొలి మూడు సినిమాలు గా సరైన సక్సెస్ లు లేని అఖిల్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.. ఈనేపథ్యంలో అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధంచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. అంతేకాకుండా ఆ సినిమా కి సురేందర్ రెడ్డి ని సెట్ చేసుకుని అందరిని మరింత ఆశ్చర్య పరిచాడు.. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది.. ఈనేపథ్యంలో హిట్ లేని అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇస్తాడని నమ్మకం అక్కినేని అభిమానుల్లో నెలకొంది..

ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్ పైకి వెళ్లడానికి 'ఏజెంట్' కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గడంతో, ఈ రోజున ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

అలాగే ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు. సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నవే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో, కథానాయికగా 'సాక్షి వైద్య' పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది.