మంచి ఎమోష‌న్స్, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘ఆక్రోశం’ సినిమాను డిసెంబర్ 16న భారీ లెవల్లో విడుదల చేస్తున్నాం: నిర్మాత సి.హెచ్‌. స‌తీష్ కుమార్‌!!

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజ‌య్ హీరోగా సి.హెచ్. స‌తీష్ కుమార్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి జ‌గ‌న్మోహిని స‌మ‌ర్ప‌ణ‌లో విఘ్నేశ్వర ఎంట‌ర్‌టైన్‌మెంట్,మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై జి.య‌న్‌.కుమార వేల‌న్ డైరెక్ష‌న్‌లో ఆర్‌.విజ‌య్ కుమార్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న  భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఆర్‌.విజ‌య్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా  బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

నిర్మాత సి.హెచ్‌.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘ఆక్రోశం’ మూవీ ..త‌ల్లి, తండ్రి, భ‌ర్త‌, భార్య‌, కొడుకు.. ఇలా కుటుంబంలోని అన్ని ఎమోష‌న్స్‌ను బ్యాలెన్స్‌ను చూపిస్తూ అంద‌రూ క‌లిసి చూసే విధంగా ఉంటుంది. దీంతో పాటు సినిమాలో మంచి యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఉంటాయి. త‌ప్ప‌కుండా అందిర‌కీ క‌నెక్ట్ అయ్యే ఎమోష‌న్స్‌తో చేసిన సినిమా కాట్టి ప్ర‌తి ఒక్కరికీ న‌చ్చుతుంది. ప్ర‌స్తుతం ఉన్న సిట్యువేష‌న్స్‌లో మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌తో మాట్లాడుకున్నాం. సినిమా అందరికీ రీచ్ కావాల‌నే ఉద్దేశంతో మా మూవీ రిలీజ్ డేట్‌ను డిసెంబ‌ర్ 16కు మార్చాం. ప్ర‌స్తుతం మ‌న స‌మాజానికి చెప్పాల్సిన కొన్ని పాయింట్స్‌ను క‌థ రూపంలో చ‌క్క‌గా తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ కుమార వేల‌న్‌. డిసెంబ‌ర్ 16న థియేట‌ర్స్‌లో మా సినిమాను తీసుకొస్తున్నాం. ప్రేక్ష‌కులు మా సినిమాను ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

హీరోయిన్ పల్లక్ లల్వాని మాట్లాడుతూ ‘‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెష‌ల్‌. హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ప్ర‌తీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి క‌లుగుతుంది. త‌మిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం. మూవీలో మ‌ధు అనే రోల్ చేశాను. డిసెంబ‌ర్ 16న మా సినిమాను చూసి స‌క్సెస్ చేయండి’’ అన్నారు.

హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న మా ‘ఆక్రోశం’ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందోన‌ని ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. నిజానికి డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయాల‌నుకున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 16న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందుకు కార‌ణం..ఓ మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నేదే మా ఆలోచ‌న‌. వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్స్‌లో మూవీని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. మ‌హిళ‌లు, అమ్మాయిలు, కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఈ సినిమాను ఎంత‌గానో ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇదొక ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. చ‌క్క‌టి మెసేజ్ ఉంటుంది.

ఏనుగు సినిమా స‌మ‌యంలో స‌తీష్‌గారితో అనుబంధం ఏర్ప‌డింది. ఇప్పుడు ఆయ‌నే ఆక్రోశం సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను వీలైనంత ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు సినిమాను రీచ్ చేయించాలనేది ఆయ‌న ఆలోచ‌న‌గా క‌నిపిస్తుది. తెలుగు ఆడియెన్స్‌కు చిన్న‌, పెద్ద అనే తేడా ఉండ‌దు. మంచి  కంటెంట్ ఉంటే తెలుగు ఆడియెన్స్ సినిమాను ఆద‌రిస్తుంటారు. అలాంటి ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది. సినిమా థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఓ ఎమోష‌న్‌తో బ‌ట‌య‌కు వెళ‌తారు. ష‌బీర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మంచి పాట‌లు కుదిరాయి. సిల్వ‌గారు యాక్ష‌న్ ఎలిమెంట్స్ కూడా ప్ల‌స్ అవుతుంది. వారికి నా ధ‌న్య‌వాదాలు. మ‌ధు అనే పాత్ర‌లో ప‌ల్ల‌క్ ల‌ల్వాని అద్భుతంగా న‌టించింది. త‌న పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డిసెంబ‌ర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్‌ను డిస‌ప్పాయింట్ చేయ‌దని గ్యారంటీగా చెబుతున్నాను.  

అరుణ్ విజ‌య్‌, ప‌ల్ల‌క్ లల్వాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో  కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందించారు.

నటీనటులు:
........................................
అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్, ఆర్. యన్. ఆర్ మనోహర్, కే. యస్. జి.వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు

సాంకేతిక వర్గం:
....................................
బ్యాన‌ర్స్‌ - విఘ్నేశ్వర ఎంటర్ టైన్‌మెంట్‌, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్ - సి.హెచ్‌.సతీష్‌ కుమార్‌, ఆర్.విజయకుమార్
దర్శకుడు - జి. యన్ ఆర్ . కుమారవేలన్
సంగీతం - షబీర్ తబరే ఆలం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - గోపీనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - మైఖేల్ బి. యఫ్.ఏ
ఎడిటర్ - ఎ.రాజమహమ్మద్
అసోసియేట్ సినిమాటోగ్రఫీ - సోడా సురేష్
అసోసియేట్ డైరెక్టర్ - కార్తీక్ శివన్
కో డైరెక్టర్ - శరవణన్ రతినం
స్టోరీ - డైలాగ్ - ఆర్ శరవణన్
కాస్ట్యూమ్ డిజైనర్ - ఆరతి అరుణ్
లిరిక్స్ - కార్కి, ఏకనాథ్, ప్రియన్, తమిజానంగు
డి. ఐ  & వి. యఫ్. యక్స్: నాక్ స్టూడియోస్
డి. ఐ కలరిస్ట్: రాజేష్ జానకిరామన్
స్టిల్స్: జయకుమార్ వైరవన్
స్టంట్ - స్టంట్ సిల్వా
ప్రొడక్షన్ అడ్వైజర్: ఆర్ రాజా
పి. ఆర్. ఓ - బియాండ్ మీడియా (సురేంద్ర కుమార్ నాయుడు-  ఫణి)
మ్యూజిక్ లేబుల్ - ముజిక్ 247
పోస్టర్స్ డిజైన్: విక్రమ్ డిజైన్స్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.