
ఒకప్పుడు మగధీర సినిమాకి వేసిన భారీ సెట్ అప్పట్లో దేశమంతా పెద్ద టాక్ అయింది. అలాగే బాహుబలి కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన మాహిష్మతి రాజ్యం సెట్ ఇప్పుడు అక్కడికి వచ్చే జనాలని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఇలా భారీ సినిమాలన్నింటిలో సెట్ లు చాలా ముఖ్యంగా మారాయి. ఇలా చరిత్రలో జరిగిన మరుపురాని ఘట్టాల్ని ఇప్పుడు దర్శకులు మళ్ళీ మనకి సెట్స్ ద్వారా తిరిగి మన కళ్ళకి కట్టినట్టు చూపించబోతున్నారు. అలా భారతదేశ స్వాతంత్రం సమయంలో జరిగిన కథగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అలాగే కే.జీ.ఎఫ్ సినిమాలో 1970, 80 సమయన్ని చూపించడానికి వేసిన భారీ సెట్స్ లలో ఈ సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా కోసం వేసిన ఆలయం సెట్ వీడియో ని చిరంజీవి గారు తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. అచ్చం నిజమైన ఆలయంగా కనిపిస్తున్న ఈ సెట్ ని చిరంజీవి గారు అధ్బుతంగా ఉంది అని పొగిడారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఈ సెట్ లో జరుగుతుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేశారు. ఇక ఈ సెట్స్ అందాలని మనం పూర్తిగా చూడాలంటే ఈ సినిమాల విడుదల వరుకు ఆగాల్సిందే.