
టాలీవుడ్ లో సుశాంత్ హీరో గా చేసిన చిలసౌ సినిమా తో డైరెక్టర్ గా పరిచయమైనా హీరో రాహుల్ రవీంద్రన్ ఆ సినిమా మంచి హిట్ అవడంతో డైరెకటోర్ గా తొలిసినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత సినిమా గా నాగార్జున తో మన్మధుడు 2 చేయగా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.. దాంతో ఆయనకు మూడో చిత్రం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ఇప్పుడు రాహుల్ మరో మంచికథను తయారుచేసుకుని రంగంలోకి దిగాడు. గీతా ఆర్ట్స్ 2 వారికి ఆయన ఆ కథను వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా గీతా ఆర్ట్స్ 2 వారు ఆయన కథను ఓకే చేశారట. దాంతో సెట్స్ పైకి వెళ్లడానికి రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నాడని, ఇది ఒక అందమైన ప్రేమకథ అని అంటున్నారు. ఓ మాదిరి బడ్జెట్ తో ఇది రూపొందనుంది. మరి ఈ లవ్ స్టోరీలో నాయకానాయికలు ఎవరో .. ఈ కథతో రాహుల్ ఎంతవరకూ యూత్ ను మెప్పిస్తాడో చూడాలి.

రాహుల్ రవీంద్రన్ 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆ స్థాయి పాత్రలు ఆయనకి లభించలేదు. దాంతో తనకి నచ్చిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. మొదటి నుంచి దర్శకత్వం పట్ల కూడా ఆసక్తి ఉండటంతో మెగాఫోన్ పట్టేశాడు.