అప్పుడే ఓటిటీ లోకి రాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్..!!

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి అన్ని పెద్ద సినిమాలు కుదేలయిపోతున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అర్థాంతరంగా ధియేటర్లనుంచి షో ఆగిపోగా మరికొన్ని రిలీజ్ వాయిదా వేసుకున్నాయి.. ఈనేపథ్యంలో సినిమాలు ఓటిటీ వైపు చూస్తున్నాయి.. ఇప్పుడు పవన్ సినిమా కూడా ఓటిటీ వైపు వెళ్ళడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. తన కెరీర్ లోచాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం ఇదే తొలిసారి.  లాయర్ గా పవన్ అదరగొట్టాడట..

ఒక్కొక్కరు రెండేసి సార్లు ఈ సినిమా చూస్తుండడంతో సినిమా కలెక్షన్స్ ఉప్పెన లా వచ్చి పడుతున్నాయి.. ఐదురోజుల్లోనే సినిమా దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది..మొత్తానికి ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడంతో పాటు అదే రేంజ్ లో కూడా హిట్ అయ్యింది..  పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న సినిమా  కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఈ సినిమా కి ఉన్న డిమాండ్ కారణంగా దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రతి సెంటర్ నుంచి సినిమా సూపర్ హిట్ అని టాక్ వచ్చింది.

అయితే వాస్తవానికి 'వకీల్ సాబ్' సినిమా విడుదలైన పది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. రిలీజైన తర్వాత థియేట్రికల్ రన్ బాగుండటంతో మూడు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా నిర్మాత దిల్ రాజు ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ వార్తలని మేకర్స్ ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలాగూ థియేట్రికల్ రన్ పూర్తవడం.. థియేటర్స్ క్లోజ్ అవడంతో మూడు వారాలకే 'వకీల్ సాబ్' ను స్ట్రీమింగ్ పెడుతున్నట్లు అర్థం అవుతోంది. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదలైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.