
వకీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత పవన్ తన తర్వాతి సినిమాల పనుల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా ఇప్పటికే ఎనభై శాతం పూర్తయ్యింది సినిమా.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్..

మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు.. హరీష్ శంకర్ సినిమా ఇంకా లైన్లో నే ఉంది..ఎలక్షన్స్ వచ్చే వరకు ఎన్ని సినిమాలు వీలుకైతే అన్ని సినిమాలు చేయాలనీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే.. ఈ నాలుగు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు హరీష్ ను దర్శకుడిని చేసిన మాస్ మహారాజ్ రవితేజ స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయం పై స్పందించిన హరీష్ సన్నిహితులు ఈ పుకార్లను కొట్టిపాడేసారు. హరీష్ ప్రస్తుతం కేవలం పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ పై మాత్రమే వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ మాస్ డైరెక్టర్ పవన్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో చూడాలి.